Majority | ఒక్క అవకాశం..

Majority | ఒక్క అవకాశం..
Majority | ధర్మపురి, ఆంధ్రప్రభ : గోవింద పల్లె గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించాలని గోవిందు పల్లె సర్పంచ్ అభ్యర్థి పురం శెట్టి రజిత సుధాకర్ ఓటర్లను అభ్యర్థించారు. గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి గ్రామానికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అన్నారు. ప్రజలు తనకు సర్పంచ్ పదవిగా అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. సోమవారం గ్రామంలో ఇంటింటా ప్రచార నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గెలుపుకు కృషి చేస్తామని స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.
