మ‌హిషాసుర మ‌ర్దినీ ధన్మోస్మీ

మ‌హిషాసుర మ‌ర్దినీ ధన్మోస్మీ

  • భక్తజన కోటి ప్రణామం
  • ప‌దో రోజు పోటెత్తిన భ‌క్తజన సందోహం
  • భ‌వానీల రాక‌తో
  • ఇంద్రకీలాద్రి అరుణమయం
  • అధికారుల పనితీరుపై భ‌క్తుల సంతృప్తి…
  • పోలీస్‌స్టేష‌న్లలో ఘ‌నంగా ఆయుధ పూజ‌

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతేష నామ‌స్మర‌ణ‌ల‌తో ఇంద్రగిరులు(The magicians) ప్రతిధ్వనించాయి. ద‌స‌రా(Dussehra) మ‌హోత్సవాల్లో భాగంగా ప‌దో రోజు క‌న‌క‌దుర్గమ్మ(Kanakadurgamma) మ‌హిషాసుర మ‌ర్దిని రూపంలో భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిచ్చారు. ద‌స‌రా ఉత్సవాల్లో చివ‌రి మూడు రోజుల‌కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దుర్గాష్టమి, మ‌హార్నవ‌మి, విజ‌య‌ద‌శ‌మి(Vijayadashami) ప‌ర్వదినాలుగా పండితులు పేర్కొంటారు.

అంత‌టి ప్రాశ‌స్త్యం ఉన్నమ‌హార్నవ‌మి రోజు అమ్మను ద‌ర్శించుకుంటే ఎటువంటి లోటుపాట్లు ఉండ‌వ‌ని భ‌క్తుల న‌మ్మకం. ఉగ్ర రూపిణిగా ఉన్న అమ్మ 18 హ‌స్తాల‌తో కెంపుల వ‌ర్ణంతో ప్రకాశిస్తూ భ‌క్తుల‌ను అనుగ్రహిస్తోంది. అక్షరమాల‌, గండ్రగొడ్డలి(Gandragodali), గద, బాణం, వజ్రాయుధం, పద్మం, ధనుస్సు, కలశం(Kalash), దండం, శ‌క్తి, ఖ‌డ్గం, డాలు, శంఖం, ఘంట‌, మ‌ద్యపాత్ర (దివ్య అమృతం), శూలం, పాశం, సుదర్శన చక్రములు ధ‌రించిన రూపంతో అమ్మ భ‌క్త జ‌నుల‌కు క‌నువిందు చేస్తోంది.

మ‌హిషాసురుడి(Mahishasurudi)ని సంహ‌రించిన అమ్మ అదే రూపంలో భక్తుల‌కు సాక్షాత్కరిస్తోంది. శివ, యుముడు, విష్ణువు, చంద్రుడు, ఇంద్రుడు, అంద‌రి దేవ‌త‌ల దివ్య తేజ‌స్సుతో త‌ల్లి అనుగ్రహిస్తోంది. మ‌హిషాసుర మ‌ర్దిని అలంకారంలో అమ్మను ద‌ర్శించుకుంటే సాత్విక భావం ఉద‌యించ‌డంతో పాటు స‌ర్వ పాపాలు హ‌రిస్తాయ‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స‌క‌ల విష‌యాలు చేకూరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మకం.

Leave a Reply