Maharashtra | హనుమాన్ భజరంగ్ మండలి బిల్లింగ్ పనులు ప్రారంభం…
- ఎంపీ నిధులతో..
Maharashtra | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ కేంద్రంలోని ఎంపీ నిధులతో భజరంగ్ మండలి భవనం పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా భజరంగ్ మండలి సభ్యులు, నాయకులు మాట్లాడుతూ… ఎంపీ నిధులతో ఐదు లక్షల పనులు మంజూరయ్యాయని మండలి నాయకులు లక్ష్మణ్ తెలిపారు. ఇంకా అదనంగా భజన మండలి భవనం కోసం అదనంగా సుమారు రూ.20లక్షల(Rs.20 lakhs) వరకు అవసరం ఉందని, ఎంపీ సురేష్ షెట్కార్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఎంపీని కోరారు.
ఈ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర(Maharashtra) సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున సంప్రదాయం ప్రతినిత్యం భజన కార్యక్రమాలు అంతేశ్వర గురూజీ ఆధ్వర్యంలో నడుస్తుందని వారన్నారు. ఈ ప్రాంతం నుండి మహారాష్ట్ర పండరిపూర్ విఠలేశ్వరుని భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారని వారు పేర్కొన్నారు.
నేటికీ బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ మండలం గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంప్రదాయంతో ప్రతినిత్యం మందిరానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి గంగాధర్, పండరి, గడ్డం సాయిలు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

