Maha Kumbhabhishekam | ఆహ్వానం..

Maha Kumbhabhishekam | ఆహ్వానం..
Maha Kumbhabhishekam, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : చల్లపల్లి మండలం పాగోలులోని కమలాత్మిక సహిత అచలాచల బోధపదేశ కైవల్య ఆశ్రమంలో జరిగే మహాకుంభాభిషేకానికి హాజరు కావలసిందిగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఆహ్వానించారు. శనివారం రాత్రి ఎంపీ కార్యాలయంలో ఆశ్రమం మేనేజింగ్ ట్రస్ట్ నిర్వాహకులు మేక సత్యనారాయణ ప్రసాద్ ఏలియాస్ బంగారు బాబు ఎంపీని దుశ్శాలువతో ఘనంగా సన్మానించి డిసెంబర్ 17, 18, 19 తారీఖుల్లో జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, మంగళాపురం సర్పంచ్ డొక్కు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
