తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాష్కి గౌడ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాకరు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్‌లోని సచివాలయానికి మంత్రి శ్రీధర్‌బాబును కలవడానికి వచ్చిన ఆయన ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమై ప్రాథమిక చికిత్స అందించారు. డిస్పెన్సరీ వైద్యుల పర్యవేక్షణలో ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం, ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం మధు యాష్కీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య స్థితి గురించి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ఘటన వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

