ఆలేరు ఐదవ వార్డులో మొరిగాడి మాధవి ప్రచారం..

ఆలేరు ఐదవ వార్డులో మొరిగాడి మాధవి ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మొరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్ ప్రచారపు చివరి రోజైన సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply