Machilipatnam | నియామకం..

Machilipatnam | నియామకం..
- టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిల ప్రకటన
Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : తీవ్రమైన కసరత్తు అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని నియమించగా, ప్రధాన కార్యదర్శిగా కాపు సామాజిక వర్గానికి చెందిన గోపు సత్యనారాయణరావును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరి నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
