లక్కీ డ్రా.. బంపర్ డ్రా లు నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్..

లక్కీ డ్రా.. బంపర్ డ్రా లు నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్..
రూ. 85 వేలు,2 సెల్ ఫోన్ లు సీజ్…
ఎసై ని, అభినందించిన సి ఐ
వెల్గటూర్, ఆంధ్రప్రభ : అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని అరచేతిలో వైకంఠం చూపిస్తామని అబద్దాలు చెప్పి లక్కీ డ్రా, బంపర్ డ్రాల పేరు చెప్పి మోసం చెయ్యాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నర్సింహారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా సి ఐ మాట్లాడుతూ… మీ… అవసరం..మా అదృష్టం అనే పేరుతో బుధవారం లక్కీ డ్రా నిర్వహిస్తున్నరన్న సమాచారం తో వెల్గటూర్ ఎస్ ఐ ఉదయ్ కుమార్ తన సిబ్బంది తో ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని రాజారాంపల్లి క్రాస్ రోడ్డు వద్ద దాడులు నిర్వహించి ధర్మారం మండలంలోని మేడారం గ్రామనికి చెందిన కట్ట రమేష్,ఎర్రగుంట పల్లె గ్రామానికి చెందిన కండెం నరేందర్ రెడ్డి అనే ఇద్దరి వ్యక్తుల ను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.
వారి వద్ద నుండి 1,రిజిస్టర్,18 కూపన్ బుక్కులు,2 సెల్ ఫోన్లు,రూ.85 వేల రూపాయల ను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. రూ. 1016 కడితే లక్కీ డ్రా లో మొదటి బహుమతి గా కీయా కారు,2వ బహుమతి గా టి వి ఎస్ బైక్,3వ బహుమతి గా ఎలక్ట్రానిక్ బైక్,4వ బహుమతి గా వాసింగ్ మెషిన్,5వ బహుమతి గా రూ.25 వేల నగదు,6వ బహుమతి గా 10 మందికి రూ.పది వేల చొప్పున అందజేయడం జరుగుతుందని స్టిక్కర్స్ లో ముద్రించడం జరిగిందని తెలిపారు.చాకచక్యంగా వ్యవహరించి లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నా వారిని అదుపులోకి తీసుకున్న ఎస్ ఐ ఉదయ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బందిని సి ఐ రాం నర్సింహారెడ్డి అభినందించారు.
ఇక నుంచి ప్లాట్లు,ఇల్లు,బైక్,కారు,గెలుచుకునే గొప్ప అవకాశం అంటూ లక్కీ డ్రా ల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ అదృష్టన్ని పరీక్షించుకోండి అంటూ ఆశ చూపిస్తూ చట్ట వ్యతిరేక పనులు చేసేవారిని ఉపేక్షించేది లేదని.లాటరీ లు,లక్కీ డ్రాలు నిర్వహించే వారి పై ఎవరు ఫిర్యాదు చేసిన తక్షణమే కేసులు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు కూడా ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ ఉదయ్ కుమార్,సీసీఎస్ శ్రీనివాస్, ఏ ఎస్ ఐ లు సూర్యనారాయణ, శ్రీనివాస్, రాజేశం, కానిస్టేబుళ్లు, తదితరులు ఉన్నారు
