LPG Supply | భారత్‌కు మరో రెండు ఎల్‌పీజీ నౌకలు!

LPG Supply | భారత్‌కు మరో రెండు ఎల్‌పీజీ నౌకలు!
LPG Supply | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా పెంపుపై దృష్టి సారించింది.
భారతదేశంలో ఎల్పీజీ నిల్వలను పెంచే లక్ష్యంతో పెట్రోలియం ఉత్పత్తులను తరలిస్తున్న మరో రెండు ఇంధన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి బయలుదేరినట్లు సమాచారం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ఈ నౌకలకు భారత నౌకాదళ యుద్ధనౌకలు భద్రత కల్పిస్తున్నాయి.
దేశంలో ఇంధన అవసరాలను సమృద్ధిగా తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు ఎల్పీజీ నౌకలు భారత్‌కు చేరుకోగా, త్వరలో మరికొన్ని నౌకలు కూడా రానున్నాయని అధికారులు తెలిపారు. ఈ చర్యలతో దేశంలో ఇంధన సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందని భావిస్తున్నారు.
