పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి బాధితురాలికి అప్పగింత..

లింగాపూర్, ఆంధ్రప్రభ ; సిర్పూర్ (యు) మండలానికి చెందిన ఓ మహిళ తన మొబైల్ ఫోన్ నూ లింగాపూర్ జగదాంబ దేవి మహా జాతర సమయంలో పోగొట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై గంగన్న ఆధ్వర్యంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ నూ ట్రాక్ చేసి పట్టుకొని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితురాలకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్సై గంగన్న మాట్లాడుతూ.. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకోవడం లేదా అపహరించడం లాంటిది జరుగుతే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సులభంగా గుర్తించి తిరిగి మొబైల్ ఫోను పొందవచ్చున్నారు.. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోను తిరిగి అప్పగించినందుకు పోలీస్ లకు బాధితురాలు కృతజ్ఞతలు తెలియజేశారు.
