మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందుచేత..

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందుచేత..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ(Shabbir Ali) బాధిత కుటుంబానికి ఈ రోజు ఎల్ఓసి లేఖను అందజేశారు. బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన రాజేష్ ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రి(Nimes Hospital)కి వెళ్లారు.

అక్కడ మెరుగైన వైద్యం కోసం మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వద్దకు వెళ్లి వారి ఆర్థిక పరిస్థితిని వివరించారు. వెంటనే ఆయన మూడు లక్షల ఎల్ఓసి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply