అక్ష‌రాభ్యాసాలు శుభారంభం

  • మహాగౌరి అవతారంలో అమ్మవారు
  • తగ్గని గోదావరి ఉధృతి
  • పుణ్యస్నానాలకు బ్రేక్
  • అమ్మవారి సన్నిధి


బాసర , ఆంధ్ర ప్రభ : నిర్మల్ జిల్లా బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి దేవి (Sri Gnana Saraswati Temple) అమ్మవారి క్షేత్రంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, పుణ్యవాచనం, గౌరినామార్చన వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించారు.


తెల్లవారు జామున మూడు గంటల నుండి ఆలయ సన్నిధి లోని అక్షరభ్యాసాలు ప్రారంభమయ్యాయి. మండపాలలో ఆలయ అర్చకులు (Temple priests) చిన్నారులకు అక్షర స్వీకార పూజలను నిర్వహిస్తున్నారు.

అమ్మవారి దర్శనానికి తెలంగాణ(Telangana) తో పాటు వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులకు, చిన్నారులకు, పాలు, బిస్కెట్లు, అరటిపళ్లను నీళ్ల బాటిల్లను పంపిణీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ (Collector Abhilasha Abhinav) దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్ కలెక్టర్ దంపతులు అభిలాష అభినవ్ చే ప్రత్యేక కుంకుమార్చన పూజ జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు.

గోదావరి నది (Godavari River) ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి నది స్నానపు ఘాట్లలో భక్తులకు పుణ్యా స్నానాలకు పోలీసులు అనుమతించడం లేదు. గోదావరి బ్రిడ్జి వద్ద భారీ కేడ్లను ఏర్పాటు చేశారు.

Leave a Reply