10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 302 మంది గైరు హాజరు…

10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 302 మంది గైరు హాజరు…

53 పరీక్ష కేంద్రాలలో అకస్మిక తనిఖీలు…
కొన్ని సెంటర్లకు దగ్గరగా ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేసిన వైనం..
మాస్ కాపీ నిరోధకానికి ప్రత్యేక చర్యలు….
రాష్ట్ర పరీక్షల అబ్జర్వర్.. అనురాధ..
పదో తరగతి పరీక్షలకు బందోబస్తుగా వెళుతున్న పోలీసులకు రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలు
..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం గణిత పరీక్షను నిర్వహించారు. నంద్యాల జిల్లాలో 130 పరీక్ష కేంద్రాల్లో గణితం పరీక్ష ప్రశాంతంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర పరీక్షల అబ్జర్వర్ మరెడ్డి అనురాధ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 130 పరీక్ష కేంద్రాలలో 24962 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా ఇందులో 24660 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

302 మంచి విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యా రు. జిల్లావ్యాప్తంగా ఆరు లైన్ స్పాట్ టీంలు 30 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. రాష్ట్ర అబ్జర్వర్ అనురాధ యాల్లూరు, గోస్పాడు దొర్నిపాడు మోడల్ స్కూల్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ జిల్లా పర్యవేక్షణ సమన్వయకర్త నరసింహులు సంయుక్తంగా 53 పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేపట్టారు. 130 పరీక్షా కేంద్రాలలో 70 మంది సెట్టింగ్ స్క్వాడ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

జిల్లాలో కొన్నిచోట్ల అక్కడక్కడ పరీక్షా కేంద్రాలకు దగ్గర్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను పోలీస్ అధికారులు మూసి వేయించారు. సార్వత్రిక విద్యాపీఠం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అబ్జర్వర్ అనురాధ తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి పరీక్షలు నేడు స్థలం, సాంకేతిక విజ్ఞానం పరీక్షను నిర్వహించారు ఈ పరీక్షకు జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అన్ని పరీక్షా కేంద్రాల్లో సెట్టింగ్స్ కోర్టును ఏర్పాటును చేసి పరీక్షలను బయటపడిందిగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్ర గాయాలు…
10వ తరగతి బందోబస్తు వెళ్తున్న సమయంలో..

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఈరోజు లెక్కల పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయానికి వెళ్లాలన్న ఆత్రుతతో మోటార్ సైకిల్ పై వెళ్తున్న పోలీసులకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విధుల నిమిత్తం బైక్ పై వెళ్తున్న సంజామలకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ను కారు ఢీ కొట్టింది. ఉయ్యాలవాడలో పదో తరగతి పరీక్షల బందోబస్తు చూసుకొని నొస్సుం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డి కి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డికి కాలు విరిగింది. చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Leave a Reply