హైదరాబాద్: నిన్నటి నుంచి కురుస్తున్న వర్షంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో విషాదాన్ని నింపాయి. నల్గొండ జిల్లా నిమ్మ తోటలో పనిచేస్తున్న మహిళ రైతు భిక్షమమ్మ (46) పిడుగు పడి మరణించారు. మహబూబాబాద్ జిల్లాల్లో మరో గొర్రెల కాపరి చేరాలు (55), ప్రవీణ్ కుమార్ (27) వనపర్తి మియాపూర్ లో గోపాల బాలరాజు (20) పిడుగుపాటుకు ప్రాణాలు విడిచారు. మరో నాలుగు రోజులపాటు ఈ పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నందున ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Lightning Storm | నలుగురి ప్రాణాలు తీసిన పిడుగులు
