భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సమీపిస్తున్న వేళ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు స్వల్ప విరామం తీసుకున్న తర్వాత, రోహిత్ శర్మ ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి క్రికెట్ గేర్‌తో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్, తనదైన ప్రత్యేక శైలిలో కవర్ డ్రైవ్స్, తన ట్రేడ్‌మార్క్ షాట్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ వీడియో రాబోయే సిరీస్‌పై అభిమానుల అంచనాలను మరింత పెంచింది.