ప్రారంభ దశలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు
సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్
మోతె, అక్టోబర్ 16 (ఆంధ్రప్రభ) : సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని ఇటీవల మంజూరు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా భూసేకరణ స్థల నిర్ధారణ, ల్యాండ్ మార్కింగ్ పనులను ఆయన గురువారం పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ. పాలేరుకు మున్నేరు, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీరు ఎత్తిపోసి పాలేరు నుండి మోతె లిఫ్ట్ ఇరిగేషన్ కు నీటిని ఎత్తిపోసి మోతె మండలానికి చెందిన 13 గ్రామాల్లో 32,417 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సాగునీటి సౌకర్యం అందించాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.వారి వెంట మోతె మండల తహసీల్దార్ ఏం వెంకన్న, సర్వేర్ ఖాజా, ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

