పండుగ సీజన్‌కు లెగసీ విస్కీ ప్రత్యేక ప్యాక్స్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బకార్డి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన లెగసీ ప్రీమియం ఇండియన్ విస్కీ, ఈ సీజన్ కోసం తన లిమిటెడ్-ఎడిషన్ పండుగ ప్యాక్‌లను ఆవిష్కరించింది. భారతదేశంలోని శక్తి వంతమైన వైవిధ్యాన్ని సంగ్రహించడానికి రూపొందించబడిన ప్రతి ప్యాక్, విభిన్న రాష్ట్రం నుండి ప్రేరణ పొందుతుంది. అద్భుతమైన, వినూత్న ప్యాకేజింగ్ ద్వారా ప్రాంతీయ కళారూపాలు, సాంస్కృతిక కథలను వేడుక చేస్తుంది.
మధ్యప్రదేశ్‌లోని చందేరి నేత నుండి రాజస్థాన్‌లోని పిచ్‌వై, సూక్ష్మ చిత్రాల వరకు, ఈ కలెక్షన్ భారతదేశ గొప్ప కళాత్మక వారసత్వానికి నివాళి అర్పిస్తుంది, పండుగ సీజన్ స్ఫూర్తితో సంప్రదాయాన్ని మిళితం చేస్తుంది.
ఈసందర్భంగా బకార్డి ఇండియా డొమెస్టిక్ డార్క్ స్పిరిట్స్ – సీనియర్ బ్రాండ్ లీడ్ శ్రీకాంత డాష్ మాట్లాడుతూ… లెగసీ విస్కీతో తాము భారతదేశ ప్రీమియం విస్కీ ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్వచిస్తున్నామన్నారు. భారతీయ, స్కాటిష్ మాల్ట్ లను ఎంపిక చేసిన భారతీయ ధాన్యాలతో కలిపి స్వదేశీ మిశ్రమాన్ని సృష్టిస్తున్నామన్నారు. ఇటీవల ప్రపంచ ప్రశంసలతో గుర్తింపు పొందిన లెగసీ భారతదేశ అభిరుచి, హస్తకళలను ప్రతిబింబిస్తుంది, వేడుక స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. వివిధ రాష్ట్రాల కథల నుండి ప్రేరణ పొందిన తమ లిమిటెడ్-ఎడిషన్ ప్యాక్‌లతో తాము దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వేడుక చేస్తున్నామన్నారు. అదే సమయంలో వినియోగదారులకు వారి ప్రియమైన వారితో సీజన్‌ను ఆస్వాదించడానికి ఒక ప్రత్యేకమైన, చిరస్మరణీయ మార్గాన్ని అందిస్తున్నామన్నారు.

