బాటిలింగ్ డిపోను తెరిపించాలని నాయకుల రాస్తారోకో

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఉట్నూర్ ఎక్స్ రోడ్ లోని ప్రోయోబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెందిన మద్యం బాటిలింగ్ డిపోను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ బాటిలింగ్ డిపో ముందర రోడ్డుపై ఆదివారం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు, బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్ చౌహన్ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం డిపోలో అగ్ని ప్రమాదం జరిగి నెలల తరబడి మూతపడ్డ ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించడంలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ప్రభుత్వం డిపో పునరుద్ధరించడంలో కాలయాపన చేస్తే ఆందోళన చేపడతామని భరత్ చౌహన్ పేర్కొన్నారు.
ఈ రాస్తారోకో చేస్తున్న విషయం ఉట్నూర్ పోలీసులు తెలుసుకొని అక్కడికి వచ్చి నాయకులు చేస్తున్న రాస్తారోకోను అడ్డుకున్నారు. మీ డిమాండ్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చవాన్ అలింధర్, రాథోడ్ ధర్మానాయక్,రాథోడ్ ప్రేమ్ కుమార్ సురుపురావు, లక్ష్మణ్ జాదవ్,శంకర్ నాయక్, చవాన్ సురేష్, బాలాజీ,తదితరులు పాల్గొన్నారు.
