Law of International | అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు తిలోదకాలు

Law of International | అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు తిలోదకాలు

Law of International | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌పంచంలో ఆదిప‌త్యం.. నోబుల్ శాంతి బ‌హుమ‌తిని ఆశించ‌డం.. చ‌మురు వ్యాపారంతో(With the oil business) అమెరికాకు ఆదాయం తెచ్చిపెట్ట‌డం.. ఇలాంటి ల‌క్ష్యాల‌తో అగ్ర‌దేశ అధినేత అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ‌డివ‌డి అడుగులు వేస్తున్నారు. ఈ అడుగులు వేసే క్ర‌మంలో ప‌లు దేశాల‌తో క‌య్యానికి కాలుదువ్వుతున్నారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు తిలోద‌కాలు ఇస్తున్నారు. వెనెజువెలా అధ్య‌క్షుడిని బంధించిన అమెరికా అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన‌ట్ల‌యింది.

Law of International

అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో ర‌ష్యా నౌక‌ను స్వాధీనం చేసుకున్న అమెరికాకు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్(Russian President Putin to America) గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా నౌక‌ల‌ను అదే మ‌హాస‌ముద్రంలో ముంచేస్తాను అంటూ పుతిన్ హెచ్చ‌రించారు. నౌక‌తోపాటు సిబ్బందిని వెంట‌నే విడిచిపెట్టాల‌ని ర‌ష్యా ష‌ర‌తు విధించింది. అమెరికా మొండికేస్తే యుద్ధం త‌ప్ప‌దు అనే సంకేతాలు సూచిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌రిణ‌మాలు చూసుకుంటే అమెరికా అధ్య‌క్షుడు యుద్ధాన్ని కోరుకుంటున్నారా? అనే సందేహం(Doubt) కూడా వ్య‌క్తమ‌వుతుంది.

Law of International | అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు అమెరికా తిలోదకాలు

Law of International

అమెరికా అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు తిలోద‌కాలు ఇస్తుంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు ట్రంప వ్య‌వ‌హార శైలిని సొంత దేశ‌మైన అమెరికాతోపాటు ప్ర‌పంచ దేశాలు కూడా మండిప‌డుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ నాయకత్వంలో వెనిజువెలాపై సైనిక చర్యలు(Military actions against Venezuela), భారత్‌పై సుంకాల విషయంలో ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా తన జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ, అంతర్జాతీయ చట్టాలను తన సౌలభ్యం మేరకు ఉపయోగిస్తుందనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇది ప్రపంచ వేదికపై అమెరికా విశ్వసనీయత(American Credibility) దెబ్బ‌తింటుంది.

Law of International | అంత‌ర్జాతీయ చ‌ట్టాల ఉల్లంఘ‌న‌కు ఇవే నిద‌ర్శ‌న‌లు

  • వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య, అంతర్జాతీయ చట్టాలు, యూఎన్‌ చార్టర్‌లోని బలప్రయోగ నిషేధాన్ని ప‌రిశీల‌కులు విమ‌ర్శిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను చిత్తు కాగితంలా అమెరికా చేసిందని వారి భావ‌న‌.
  • భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికాలోనే ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘించినట్లు ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌ దృష్టికి వచ్చింది.
  • అమెరికా అనేక అంతర్జాతీయ సంస్థల నుండి, ముఖ్యంగా భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి నుండి వైదొలగడం, అంతర్జాతీయ సహకారం పట్ల దాని వైఖరిని సూచిస్తుంది.

Law of International | నేను ఆ చ‌ట్టాల‌ను ప‌ట్టించుకోను : ట్రంప్‌

Law of International

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాను అంతర్జాతీయ చట్టాల(International laws) కన్నా తన సొంత నైతికతకు కట్టుబడి ఉంటానని, అంతర్జాతీయ చట్టాలు అవసరం లేదని వ్యాఖ్యానించడం ప‌లు విమర్శలకు దారితీసింది. అమెరికా తన జాతీయ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది, కొన్నిసార్లు అంతర్జాతీయ చట్టాలను విస్మరించడానికి ఇది కారణమవుతుంది. ఐక్యరాజ్యసమితి(United Nations)లో వీటో అధికారాన్ని ఉపయోగించి, తన చర్యలకు అనుకూలంగా వ్యవహరించడం, అంతర్జాతీయ చట్టాలను బలహీనపరుస్తుంది.

Law of International | క‌య్యానికి కాళ్లు దువ్వుతున్న ట్రంప్‌

Law of International

ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప‌రిశీలిస్తే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) క‌య్యానికి కాళ్లు దువ్వుతున్న‌ట్లు ఉంది. వెనెజువెల అధ్య‌క్షుడిని బంధించ‌డం.. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం.. అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో ర‌ష్యా నౌక‌ను స్వాధీనం చేసుకోవ‌డం.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప‌రిశీలిస్తే ట్రంపు క‌య్యానికి కాళ్లు దువ్వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. రష్యా రవాణా మంత్రిత్వ శాఖ(Ministry of Transport of Russia) మాట్లాడుతూ, ‘1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ప్రకారం, ఏ దేశ‌మూ ఇతర దేశాల‌ అధికార పరిధిలో చట్టబద్ధంగా తిరిగే నౌకలపై ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకునే అధికారం లేదు’ అని తెలిపింది.

Law of International

పుతిన్‌కు సన్నిహితుడైన ఎంపీ ఆండ్రీ క్లిషాస్ మాట్లాడుతూ, ట్యాంకర్ను అమెరికా స్వాధీనం(US seizes tanker) చేసుకోవడం సముద్రపు దోపిడీ అని అన్నారు. నౌక‌తోపాటు సిబ్బందిని వెంట‌నే విడిచిపెట్టాల‌ని ర‌ష్యా ష‌ర‌తు విధించింది. అమెరికా మొండికేస్తే తొలుత అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలో యుద్ద‌మేఘాలు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏమి జ‌రుగుతుందో చూద్దాం!

CLICK HERE TO READ యూర‌ప్ దేశాల నిర్ణ‌యం ఏమిటో?

CLICK HERE TO READ MORE

Leave a Reply