పాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు తూప్రాన్ మోసెస్ న్యూటన్
నార్సింగి : చేగుంట (Chegunta) మండల కేంద్రంలో సమాధుల నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం స్థలం మంజూరు చేయాలని పాస్టర్ల సంఘం (Pastors Association) జిల్లా అధ్యక్షుడు మోసెస్ న్యూటన్ విజ్ఞప్తి చేశారు. రామాయంపేట (Ramayampet) లోని చర్చిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన మాట్లాడారు.సచేగుంట, రామాయంపేట, నార్సింగిలో సమాధుల నిర్వహణ నిమిత్తం స్థలం కేటాయించాలన్నారు ఈ మేరకు మెదక్ జిల్లా (Medak District) పరిధిలోని ఏడు మండలాల్లో ఉన్న పాస్టర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సమాధుల స్థలాల కోసం త్వరలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలుస్తామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు తమ సమస్యలను మోసెస్ న్యూటన్ దృష్టికి తీసుకెళ్లారు. అందరి సహకారంతో సాధ్యమైనంత మేర సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తమ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజు, సహాయ కార్యదర్శి స్టీఫెన్, కోశాధికారి దేవయ్య, చేగుంట మండల అధ్యక్షులు ప్రభుదాస్, పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.