kutami | 78 బోర్ట్స్ లైసెన్స్..

kutami | 78 బోర్ట్స్ లైసెన్స్..
kutami, బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి మత్స్య సహాయ సంచాలకుల కార్యాలయంలో మత్స్యకారులకు నూతనంగా 78 బోర్ట్స్ లైసెన్స్ సర్టిఫికెట్స్, బోర్ట్ యజమానులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవన భృతి కింద ఏటా 20వేల రూపాయలను అందజేశారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు ఆయిల్ రాయితీని నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఆయిల్ రాయితీ బిల్లులను చెల్లించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మత్స్యకారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
