Kurnool | నకిలీ ఆర్.సీలు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

కర్నూలు బ్యూరో, జూలై 21, ఆంధ్రప్రభ నకిలీ ఆర్.సీలు తయారు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు ఆరెస్టు చేశారు. కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ సోమవారం కర్నూల్ త్రీ టౌన్ సీఐ శేషయ్య తో కలసి పాత్రికేల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.

నంద్యాలకు చెందిన షేక్ సుబాన్, షేక్ షాపీర్, డీ. సుధీర్ బాబు, కర్నూలుకు చెందిన పెనుగొండ సూరప్ప నకిలీ ఆర్.సీలు తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు.కొన్నిరోజులు క్రితం ద్విచక్రవాహానాల రికవరీ కేసులో ఓవాహానానికి సంబందించిన ఆర్.సీ నకిలీదిగా గుర్తించడంతో పోలీసులు ధర్యాప్తు చేసి ముఠా సభ్యులను గుర్తించినట్లు డిఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.

నిందితులు దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లి, కేరళ, కర్ణాటక, ఓరిస్సా, గుజారాత్,పంజాబ్.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఆర్.టీ.ఓ బ్రోకర్ల ద్వారా నకిలీ ఆర్.సీలు తయారు చేసే వారని డిఎస్పీ తెలిపారు. వీరు నకిలీ ఆర్.సీ లతో పాటు పోలీసు ఎన్.ఓ.సీ సర్టిఫికేట్లు, ఐటీఐ సర్టిఫికేట్లు తయారు చేసినట్లు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి వారి నుంచి రెండు కార్లు, నకిలీ ఆర్.సీలు, సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నామని కర్నూల్ డీఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ వెల్లడించారు.

Leave a Reply