KTR | శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న కేటీఆర్

KTR | శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న కేటీఆర్
KTR | గీసుగొండ, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా (Warangal District) గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (Sri Naga Subrahmanyeshwara Swamy) వారిని మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (KTR) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది.
ఆలయ ప్రధానార్చకులు సముద్రాల సుదర్శన చార్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Former MLA Challa Dharma Reddy), గండ్ర వెంకట రమణా రెడ్డి, శంకర్ నాయక్, పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, వాసుదేవ రెడ్డి బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
