KTR | ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు

KTR | ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు
- హంగ్ వచ్చిన చోట్ల తమకే అనుకూలం
KTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సింగరేణి కార్మికులకు అండగా ఉంటామన్న సందేశం ఇచ్చే ఆలోచనతోనే కొత్తగూడెంలో సీపీఐకి తాము మద్దతు ఇస్తున్నామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మున్సిపల్ పీఠాలకు సంబంధించి ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుపై సీఎస్, ఎస్ఈసీను కేటీఆర్, ఆ పార్టీ నేతలు కలిశారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ…
30కిపైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాం.. కానీ, కొంత తగ్గిందన్నారు. హంగ్ వచ్చిన చోట్ల కూడా తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా లేదని, స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులుంటాయని, వాటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని కేటీఆర్ అన్నారు.
