MILK CHECK : బందరు పాల కేంద్రాల్లో తనిఖీలు Andhra Prabha News

MILK CHECK : బందరు పాల కేంద్రాల్లో తనిఖీలు Andhra Prabha News
- ఎస్.ఎస్. మిల్క్, కృష్ణవేణి డెయిరీలో శాంపిల్స్ సేకరణ
- అనుమతి లేని బాదం పాల ప్యాకెట్ల ధ్వసం
- వినియోగదారులకు ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ

రాజమండ్రి కల్తీ పాల ఘటన అనంతరం కృష్ణాజిల్లాలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్ లోని పాల కేంద్రాలలోని పాలును తనిఖీ చేశారు. మచిలీపట్నంలో చిలకలపూడి ప్రాంతంలో ఎస్.ఎస్.మిల్క్, జిల్లా పరిషత్ కృష్ణవేణి మిల్క్ డైరీ పాల కేంద్రాల నుండి పాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్స్ కి పంపించారు. ఎమ్మార్పీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని, అత్యధిక కాలం ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను గుర్తించి డిస్ట్రాయ్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ వినియోగదారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ తనిఖీలో వెటర్నరీ డాక్టర్ వీరంకి మధుబాబు పాల్గొన్నారు.
