కృష్ణ శతకం

88. ఆత్మయన్న దాని ఔన్నత్యమునుదెల్పి
కనులు తెరచునట్లు కాంతినింప
జన్మకంతకన్న సాఫల్యముండునా?
గీతదాత నీకు కేలుమోడ్తు

89. జన్మమారు పూర్వజన్మ సుకృతములు
వెంటవచ్చుననుట వింటిమయ్య
జన్మబంధములునుసతమతమ్మును చేయు
గీతదాత నీకు కేలుమోడ్తు

90. పనిచేయుటొకటె మనిషి చేతులనుండు
ఫలము నిర్ణయించు వాడవీవె
విర్రవీగు మనిషి వెర్రివాడే కదా
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply