హుజూర్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ లో కోతి సంపత్ రెడ్డి పేరు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి బీసీ జనరల్ కావడంతో వైస్ ఛైర్మన్ పదవి జనరల్ క్యాటగిరి కి చెందిన వ్యక్తి కి ఇవ్వాలన్న ఆలోచనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఒకవేళ జనరల్ రిజర్వ్ వ్యక్తికే వైస్ చైర్మన్ పదవి ఇస్తే ఆ కోటాలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, 25 వార్డ్ కౌన్సిలర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ప్రధాన అనుచరుడిగా ఉన్న కోతి సంపత్ రెడ్డి పేరే ముందుంది.

గత మున్సిపాలిటీ పాలకవర్గం లో 3 వార్డ్ కౌన్సిలర్ గా గెలిచి హుజూర్‌నగర్ పట్టణంలోనే ఆ వార్డ్ ను అత్యంత వేగంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వార్డ్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత పాలక వర్గంలో 3 వార్డ్ బిసికి రిజర్వ్ కాగా తన అనుచరుడైన 25 వార్డ్ కు చెందిన సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ కు టికెట్ ఇప్పించుకొని ఏకగ్రీవంగా గెలిపించుకొని 25 వార్డ్ లో బారీ మెజారిటీతో కౌన్సిలర్ గా గెలిచాడు. అంతే కాకుండా కొన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవటంలో కోతి సంపత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఇన్ని అర్హతలు ఉన్న కోతి సంపత్ రెడ్డి కి హుజూర్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రకటిస్తారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

Leave a Reply