Kondapur | విద్యార్థులకు షూలు అందజేత

Kondapur | విద్యార్థులకు షూలు అందజేత

Kondapur | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో కీర్తిశేషులు ఇప్ప గంగాభవాని జ్ఞాపకార్థం ఆమె భర్త ఇప్ప లచ్చయ్య శనివారం విద్యార్థులందరికీ బూట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలకు కొంతమంది పేద విద్యార్థులు చెప్పులు లేకుండా పాఠశాలకు రావడం గమనించి వారికి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులు బూట్లు అందజేశామన్నారు. అనంతరం గ్రామస్తులు ఆయనను శాలువతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇప్పరవలి సురేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, లక్ష్మీరాజం, ఉపాధ్యాయురాలు లక్ష్మీ, మాజీ సర్పంచ్ ఇప్ప కిష్టయ్య, మాజీ ఉప సర్పంచ్ ఇప్ప రమేష్, ఇప్ప సురేందర్, ధర్మ జాగరణ కార్యకర్త పసర్తి గంగారెడ్డి, సత్తన్న, వేమూనూరి రమేష్, యూత్ అధ్యక్షులు ఇప్ప రాజేందర్, ఇప్ప సాయి, పులి శెట్టి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply