KONDAPALLI : కౌన్సిల్ గరం గరం

KONDAPALLI : కౌన్సిల్ గరం గరం
- – ఇంటి పన్నుల్లో వ్యత్యాసాలు
- తాగునీరు కలుషితం
- అవినీతిపై వైసీపీ ఆరోపణలు
- – అధికార, ప్రతిపక్షం వాగ్వాదం
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా ) :

కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో వాడీవేడిగా ముగిసింది. కొండపల్లి పురపాలక సంఘం (Kondaplli Counsel Hot Hot) కార్యాలయం కౌన్సిల్ హాల్ లో చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు (Chairman Chitti Babu) అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.
ఎజెండాలో పొందుపర్చిన అంశాలు చదివి వినిపించారు. అనంతరం ఇంటి పన్నుల్లో మున్సిపల్ అధికారుల భారీ అక్రమాలను వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు (Ycp Floor Leader) కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంటి పన్నుల్లో (House Tax) వ్యత్యాసాలును (Deferences) నేటికీ పూర్తి చేయకపోవడంతో ప్రజలపై భారం పడుతుందని వాపోయారు. సకాలంలో పన్నులు విధించకుండా, వసూలు చేయకపోవడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం తగ్గిపోతుందన్నారు.
అధికారుల తప్పిదం వల్లే ఇలా జరుగుతుందన్నారు. జేబులు నింపుకునేందుకు అవకాశం ఉన్న పన్నులపై అధికారులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. పన్నులపై నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనిపై చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ గతంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది అవకతవకలకు (Irregularities) పాల్పడినట్లు గుర్తించామని, వారిపై (Action) చర్యలు ఉంటాయన్నారు. పన్నుల్లో వ్యత్యాసాలను సరిచేసే ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.
KONDAPALLI : తాగునీరు కలుషితంపై ఆగ్రహం

తాగునీటిలో ఎన్టీటీపీఎస్ అధికారులు (Nttps Oficials) పదేపదే బూడిద నీరు (Adding Ash in Water) కలుపుతున్నా.. నివారణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గుంజ ప్రశ్నించారు. ఇంటి పన్నుల్లో వ్యత్యాసాలు, తాగునీటిలో బూడిద నీరు కలవడంపై వైసిపీ సభ్యులు ప్ల కార్డులు, పత్రికల్లో వచ్చిన కథనాలు ప్రదర్శించి నిరసన (Prtest) తెలిపారు.
పోడియం ముందుకెళ్లి ప్ల కార్డులు ప్రదర్శించారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు పోడియంపై కూర్చోవడంతో టీడీపీ సభ్యులు (Tdp Objected) అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయన పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
సభా మర్యాదలు తెలియని అజ్ఞాని అని గుంజ శ్రీనివాసునుద్దేశించి చైర్మన్ చిట్టిబాబు వ్యాఖ్యానించారు. ప్రతిగా గుంజ కూడా చైర్మన్ ను ఉద్దేశించి మీరే రాజకీయ అజ్ఞాని అని అన్నారు. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది.
KONDAPALLI : అవినీతి ఆరోపణల వెల్లువ

కాగా మున్సిపాలిటీపై అనేక అవినీతి కథనాలు (Coreption) వస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని గుంజ నిలదీశారు. అవినీతి జరగకపోతే ఖండించాలని, లేకుంటే అవినీతిపై కథనాలు వాస్తవాలనే నమ్మకం కలుగుతుందన్నారు.
దీనిపై చైర్మన్ స్పందిస్తూ మున్సిపాలిటీలో అవినీతి జరగలేదని, కావాలనే కొన్ని దుష్టశక్తులు అవినీతి కథనాలు రాయించి తమకు మరక అంటించాలని చూస్తున్నాయని చెప్పారు. అసత్య కథనాలపై (Fake News) జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
కార్తీక మాసం ముగింపు సందర్భంగా కోటి దీపోత్సవానికి మున్సిపల్ నిధుల నుంచి రూ.3.60 లక్షలు ఎందుకు ఖర్చు చేశారని వైసీపీ కౌన్సిలర్ మొగిలి దయాసాగర్ ప్రశ్నించారు. చైర్మన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమం కోటి దీపోత్సవం విజయవంతానికి పారదర్శకంగా ఖర్చు చేశామని, అన్నింటికీ లెక్కలు (Acounts) ఉన్నాయని వివరణ ఇచ్చారు.
టీడీపీ కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మి మాట్లాడుతూ ఇంటి పన్నులకు డిమాండ్ నోటీసులు ఇచ్చి వదిలేయడంతో వడ్డీలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు.
KONDAPALLI : పారిశుద్ధ్యంపై నిలదీత

వార్డుల్లో పారిశుధ్యం (Sanitation) అధ్వానంగా ఉందని టీడీపీ కౌన్సిలర్లు జల్లి జ్యోతి, ముప్పసాని భూలక్ష్మి వివరించారు. పారిశుధ్య సిబ్బంది అసలు రావడం లేదని ఆరోపించారు. మొదటి కౌన్సిల్ సమావేశంలో రోడ్డు నిర్మాణానికి టెండర్ పిలిచినా నేటికీ నిర్మాణం ప్రారంభించలేదని కౌన్సిలర్ జ్యోతి అన్నారు.
ఎస్సీలు నివసించే వార్డుపై నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. అధ్వానంగా ఉన్న పారిశుధ్య చిత్రాలను ఆమె కౌన్సిల్ లో ప్రదర్శించారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఛత్తీస్ గఢ్ జాతీయ రహదారిపై వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని 24వ వార్డు కౌన్సిలర్ పులి అరుణకుమారి కోరారు. అధికార పార్టీ కౌన్సిలర్లు సమస్యలపై కౌన్సిల్ లో ప్రశ్నించడంతో ప్రతిపక్ష కౌన్సిలర్లు చప్పట్లు కొట్టి అభినందించారు.
ఒక సమావేశంలో సమస్యలు ప్రస్తావించి వెళ్ళిపోతున్నామని, మళ్లీ సమావేశం వరకు సమస్యలు పరిష్కారం కావడం లేదని, కనీసం వార్డులో ఒక్కసారైనా బ్లీచింగ్ చల్లుతున్నారా? అని 14వ వార్డు వైసీపీ కౌన్సిలర్ నల్లమోతు లక్ష్మి, 28వ వార్డు వైసీపీ కౌన్సిలర్ బాడిశ నాగరాజకుమారి ప్రశ్నించారు.
KONDAPALLI : పనుల కోసం ఉడుం పట్టు
వార్డులో అసంపూర్తిగా నిలిచిపోయిన సచివాలయం భవనం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆమె కోరారు. వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు కలుగ చేసుకోవడంతో సమస్యలు ఆయన పరిష్కరిస్తారని చెబితే చైర్మన్ దృష్టికి తీసుకెళ్లమని ఎద్దేవా చేశారు.
ఒకటో వార్డులో ఆర్వో ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలని, చేతిపంపులకు మరమ్మతులు చేయాలని, సచివాలయం ఎదురుగా సీసీ రోడ్డు నిర్మించాలని ఆ వార్డు కౌన్సిలర్ మండే చంద్రం విజ్ఞప్తి చేశారు. వైస్ చైర్మన్ మాట్లాడుతూ టెండర్లు పిలుస్తున్నారు కానీ, పనులు ప్రారంభించడం లేదన్నారు.
పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో (Block list) పెట్టాలని కోరారు. చైర్మన్ చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యుల సూచనలు, సలహాలు మేరకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సమస్యలు పరిష్కరించి పట్టణ అభివృద్ధికి తోడ్పడతామన్నారు.
