Kiwis vs BAN – రచిన్ రవీంద్ర శతకం – బంగ్లాపై న్యూజిలాండ్ ఘనవిజయం

రావల్పిండి : చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పాకిస్తాన్ లోని రావల్పిండి వేదికగా ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్లు విజయం సాధించింది.. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో టీమిండియాతో పాటు న్యూజిలాండ్ కూడా సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకున్నట్లఅయింది.

అధికారికంగా సెమిస్ కు వెళ్ళినప్పటికీ ప్రస్తుత పాయింట్స్ టేబుల్ ప్రకారం టీమిండియా అలాగే న్యూజిలాండ్ రెండు సెమి ఫైనల్ కు వెళ్తాయి.

ఇవాల్టి మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన సెంచరీ తో… బంగ్లాదేశ్ టీమ్ కు చుక్కలు చూపించాడు. 105 బంతుల్లోనే 112 పరుగులు చేసి న్యూజిలాండ్ ను విజయతీరాలకు చేర్చాడు రవీంద్ర. న్యూజిలాండ్ ఆటగాడు రవీంద్ర కు తోడుగా వికెట్ కీపర్ టామ్ లాతం కూడా 55 పరుగులతో రాణించాడు. ఈ తరుణంలోనే… ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్… గ్రాండ్ విక్టరీ కొట్టింది.

ఇక అంతకుముందు బంగ్లాదేశ్ టీం నిర్ణీత 50 ఓవర్లలో… 9 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ 236 పరుగులు చేయడానికి కూడా చాలా కష్టపడింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో 77 పరుగులు చేయగా… జకీర్ అలీ 45 పరుగులు చేసి జట్టుకు… గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఇక బంగ్లాదేశ్ ఇచ్చిన లక్ష్యాన్ని ఐదు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది న్యూజిలాండ్.

గ్రూప్ ఏ లో నాలుగు జట్లు ఉండగా… అందులో న్యూజిలాండ్ అలాగే టీమిండియా మాత్రమే… సెమిస్ వెళ్లేలా… తమ దారులను సుగమం చేసుకున్నాయి. ఈ రెండు జట్లు ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించాయి. దీంతో… న్యూజిలాండ్ అలాగే టీమిండియా చెరో నాలుగు పాయింట్లు సంపాదించాయి. ఇవాళ బంగ్లాదేశ్ పైన గెలిచిన న్యూజిలాండ్ టీం… గ్రూప్ ఏ లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. టీమిండియా రన్ రేట్ న్యూజిలాండ్ కంటే చాలా తక్కువగా ఉంది.

అందుకే పాయింట్స్ టేబుల్ లో న్యూజిలాండ్ మొదటి స్థానానికి వెళ్లగా… రెండవ స్థానంలో టీమిండియా నిలిచింది. ఈ రెండు జట్లు… మరో మ్యాచ్ లో ఆడబోతున్నాయి. ఇందులో ఎవరు గెలిచినా… ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పటికే చెరో నాలుగు పాయింట్లు సంపాదించారు కనుక… న్యూజిలాండ్ అలాగే టీమిండియా నేరుగా సెమి ఫైనల్ కి వెళ్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *