Kinjarapu Atchannaidu | క్యాబేజీ పూలతో శుభాకాంక్షలు..

Kinjarapu Atchannaidu | క్యాబేజీ పూలతో శుభాకాంక్షలు..

Kinjarapu Atchannaidu | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు (Minister Kinjarapu Atchannaidu) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వారి స్వగ్రామమైన నిమ్మాడకు జనాలు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుండే శుభకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక ముందు బారులుదీరారు. కొందరు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారు ఎటువంటి పుష్పగుచ్చాలు తేవొద్దని ముందస్తుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రకటించారు.

ఈనేపధ్యంలో కొంతమంది పుష్పగుచ్చాలు తేకుండా వచ్చి శుభాకాంక్షలు తెలుపగా, మరికొంతమంది పూలమాలలు తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా, వీరఘట్టానికి చెందిన కొంత మంది రైతులు (Farmer) మంత్రులకు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యాబేజీ పూలు పట్టుకొని రావడం చర్చనీయాంశమయ్యింది. క్యూలైన్లలో క్యాబేజీ పూలు పట్టుకొని వారు వస్తుండడంతో అక్కడికి వచ్చిన ఇతరులతో పాటు, మంత్రులు కూడా ఆశ్చర్యంగా చూసారు. పుష్పగుచ్చాలు తేవద్దని చెప్పినందున తాము వెరైటీగా క్యాబేజీ పూలు తీసుకువచ్చామని తెలిపారు. వాటిని అందుకున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు కాసేపు నవ్వుకున్నారు.

Leave a Reply