ipl2026| ఇన్ ఫ్రంట్ దేర్ ఇజ్ ఏ బిగ్ క్రొకడైల్ ఫెస్టివల్

ipl2026| ఇన్ ఫ్రంట్ దేర్ ఇజ్ ఏ బిగ్ క్రొకడైల్ ఫెస్టివల్
కింగ్ ఈజ్ బ్యాక్
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే టాప్‌లేపిన కింగ్
హాఫ్‌సెంచరీతో బెంగళూర్‌ను గెలిపించాడు
టీ20 రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవాలంటున్న ఫ్యాన్స్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన సత్తా చాటాడు. వయసు పెరుగుతున్నా తన ఆట తగ్గలేదని మరోసారి నిరూపించాడు. తన పేరుకు తగ్గట్టూ నిన్న హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఏమాత్రం తగ్గలేదు. ఛేజింగ్ మాస్టర్ అని తనకు ఉన్న బిరుదును నిజం చేస్తూ బెంగళూర్‌ను గెలిపించాడు. కోహ్లీ దూకుడుగా ఆడుతూ చివరి వరకూ ఉండి మ్యాచ్‌నూ ముగించాడు. విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 నాటౌట్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి రాబోయే మ్యాచుల్లో ఇలాగే ఉంటుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు.

అయితే కింగ్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే టీ20లు ఆడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మట్‌క వీడ్కోలు పలికాడు. అయితే ఇలా రెచ్చిపోయి ఆడుతున్న కోహ్లీని మళ్లీ అంతర్జాతీయ మ్యాచులు ఆడాలని అభిమానులు కోరుతున్నారు. మీలో ఇంకా చావ తగ్గలేదని, మళ్లీ జాతీయ జట్టుకు ఆడాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కేవలం వన్డేల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే. చివరి సారి ఆఖరి మెట్టుపై బొక్క బోర్లపడి వన్డే ప్రపంచకప్ చేజార్చుకున్న భారత్‌కు వచ్చేసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కోహ్లీ వన్డేలో కొనసాగుతున్నాడు.
కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది. కనీసం మూడు లేదా నాలుగేళ్ల వరకూ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అలాగే ఐపీఎల్‌లో టీ20 ఫార్మాట్ మ్యాచ్‌లను ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా తరఫున ఆడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడితే తాను ఆడతానని కోహ్లీ అన్నాడు. రాబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. దీంతో అతడు టీ20 వీడ్కోలు నుంచి బయటకొచ్చేస్తాడంటూ ఫ్యాన్స్ సంబరపడ్డారు.
టాప్‌లో కోహ్లి
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి పేరు మీదే ఉంది. ఈ స్టార్ ప్లేయర్ 64 అర్ధశతకాలతో టాప్ లో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (62) సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఛేజ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్న కోహ్లి ఐపీఎల్ ఛేజింగ్ లో 4000 రన్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు.
