Khammam | శ్రీ చైతన్యలో రాలిన విద్యాకుసుమం
ఖమ్మం – ఖమ్మం శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) కాలేజీ హాస్టల్‌లోని తన గదిలో నేటి ఉదయం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయం 6.30 గంటలకు గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బందికి చెప్పారు. దీంతో ఆమెను పట్టణంలో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలసుకున్న విద్యార్థి సంఘాలు హాస్పిటల్ వద్ద ఆందోళకు దిగారు. ఆమె కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.