Kerala | ఆలయ ఉత్సవంలో ఏనుగుల బీభత్సం – ముగ్గురి మృతి

కోజికోడ్‌ , కేరళ: కోజికోడ్‌లోని కోయిలాండిలో జరిగిన ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది.మణికులంగర ఆలయంలో ఉత్సవం జరగుతుండగా భక్తులు బాణాసంచా పేల్చారు. ఉత్సవాల కోసం ఆలయానికి రెండు ఏనుగులను తెచ్చారు. అయితే గురువారం రాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో టెంపుల్ ఆవరణలో క్రాకర్స్ పేల్చడంతో పీతాంబరన్ , గోకుల్ అనే రెండు ఏనుగులు భయంతో పరుగులుపెట్టాయి.

టపాసుల శబ్ధాలకు ఉత్సవాల కోసం తెచ్చిన ఏనుగులు భయపడిపోయి జనంపైకి కదిలాయి. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *