Kerala | స్పెషల్ గిఫ్ట్..
Kerala, ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో : గృహ, పట్టణ వ్యవహారాల స్థాయి కమిటీ పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు కేరళలోని కొచ్చిన్ చేరుకున్నారు. పర్యటన సందర్భంగా తాజ్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ హోటల్లో కమిటీకి అధికారులు ఆతిథ్యమిచ్చారు. కమిటీ ఛైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreenivasulu Reddy) పై తమ గౌరవాన్ని వ్యక్తం చేసే విధంగా ఒక స్పెషల్ గిఫ్ట్ అందించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి చిత్రాన్ని పుచ్చపండు పై కళాత్మకంగా చెక్కి అలంకార రూపంలో హోటల్ ప్రాంగణంలో ప్రదర్శించడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ వినూత్న ఆతిథ్యాన్ని కమిటీ సభ్యులు అందరూ అభినందించారు.

