ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

జైనూర్,/ సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్,సిర్పూర్ (యు) మండలాల్లో మంగళవారం బి ఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ కెసిఆర్ కృషితోనే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందని, ఆయన 10 ఏళ్ల ముఖ్యమంత్రి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు.
ఆయా మండలాల్లో జరిగిన కార్యక్రమంలో ఆసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, జైనూర్ మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాత్రం సిర్పూర్ (యు) మాజీ ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, జైనూర్ సిర్పూర్ (యు) మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల, తోడసం ధర్మారావు, జైనూర్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు మడావి భీ0రావు, జై నూర్ మండల ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కుమ్ర భగవంతరావు, బి ఆర్ఎస్ సర్పంచులు, కొడప ప్రకాష్, రాథోడ్ శ్రవణ్ జాదవ్ బాహురావు, కుమ్ర భీమ్రావు, జై నూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గేడం లక్ష్మణ్, బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
