వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తాను ఎమ్మెల్సీ పదవికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్‌లో కవిత ఈ విషయాన్ని ప్రకటించారు. స్పీకర్ ఫార్మెట్‌లో శాసన మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖను పంపిస్తున్నానని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి (BRS primary membership) రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ లేఖను బీఆర్ఎస్ ఆఫీస్‌కు పంపిస్తున్నానని తెలిపారు. 27 ఏళ్ల వయస్సులో రాజకీయాలకు వచ్చానని, సుమారు 20 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తనకు పదవులపై ఆశ లేదని, ఉద్యమంలో ఉంటానని చెప్పారు.
రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు మ్యాచ్ ఫిక్సింగ్..
బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ (KCR) కుటుంబాన్ని విచ్చిన్నం చేయడానికి మాజీ మంత్రి హరీశ్‌రావు కుట్ర చేస్తున్నారని అన్నారు. హరీశ్‌రావు, సీఎం రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణించినప్పుడు, వారిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఆనాటి నుంచి హరీశ్‌రావు కుట్రలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మీ ఇద్దరు ఒకే విమానంలో ప్రయాణం చేశారో, లేదో రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు చెప్పాలని అన్నారు. సీఏం రేవంత్ రెడ్డికి సరేండర్ అయిన హరీశ్‌రావు కుట్రలు ప్రారంభించారు.