కౌశిక్ రెడ్డి జాగ్రత్త…తాట తీస్తాం బిడ్డా..!

కౌశిక్ రెడ్డి జాగ్రత్త…తాట తీస్తాం బిడ్డా..!

  • ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.
  • నీకు కడియం శ్రీహరిపై మాట్లాడే అర్హత లేదు
  • హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
  • గన్‌తో కాల్చేస్తానని సైగలు చేయడం ప్రజాస్వామ్యానికి అవమానం
  • స్పీకర్ జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలి
  • దళిత సమాజాన్ని అవమానించినట్లేనని ఆగ్రహం
  • ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఆందోళనలు చేపడతాం
  • స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత…కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
  • మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ వద్ద జాతీయ రహదా రిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆదివారం స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో కడియం పై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక కాంగ్రెస్ నాయ కులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడి యం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ఘాటుగా స్పం దించారు. తాటా తీస్తాం బిడ్డా..!ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నీకు కడియం శ్రీహరిపై మాట్లాడే అర్హత లేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం వ్యక్తిగత అవమానం మాత్రమే కాకుండా మొత్తం దళిత సమాజాన్ని అవమానించినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కడియం రాజకీయ చరిత్ర గురించి మాట్లాడే అర్హత నీకు లేదు:

మీ హద్దులు తెలుసుకుని మాట్లాడాలి..ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజ కీయ చరిత్ర గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అసెంబ్లీలో గన్‌తో కాల్చేస్తానని సూచించేలా సైగలు చేయడం ప్రజాస్వామ్యానికి అవమా నమని చైర్మన్ వినయ్ కుమార్ పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అను భవం కలిగిన కడియం శ్రీహరి వంటి నాయకుడిపై ఈ విధంగా మాట్లా డిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్ తక్షణ మే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పాడి కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని విన య్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకెళ్లి హౌ స్ కమిటీ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమని పేర్కొంటూ ముఖ్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ పున రావృతం అయితే మా నాయకుడి అభిమానులు, కుటుంబ సభ్యులు, అనుచరులు చూస్తూ ఊరుకోరు.

పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతా మని వినయ్ కుమార్ గట్టిగా హెచ్చరించారు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూర్ల శంకర్, నీల గట్టయ్య, కొలిపాక సతీష్, నాగారబోయిన శ్రీరాములు, గట్టు రమేష్, సింగపురం దయాకర్, కౌన్సిలర్ లు సంపత్ రాజు, అన్నెపు సుమలత కుమార్, తిరుమలనాధ దేవస్థానం చైర్మన్ నర్సింహులు, డైరెక్టర్ గట్టు ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్ మారపాక వసంత్, యూత్ నాయకులు ఇల్లందుల విజయ్, ఐలపాక శ్రీనివాస్, చింత జగదీశ్, మాసిక్, ఆఫ్సార్, శ్రీకాంత్, చింత జోసప్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply