Kanchana re release | రికార్డ్ సెట్ చేసేనా..?

Kanchana re release | రికార్డ్ సెట్ చేసేనా..?
Kanchana re release | పోకిరితో స్టార్ట్ అయిన రీ రిలీజ్ ట్రెండ్
ట్రెండింగ్‌లోకి వచ్చిన కాంచన రీ రిలీజ్
కాంచనకు వస్తున్న క్రేజీ రెస్పాన్స్
అంచనాలు పెంచుతున్న కాంచన 4
Kanchana re release | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాఘవ లారెన్స్ తెరకెక్కించిన సంచలన చిత్రం కాంచన. ఆ సినిమా తెలుగు, తమిళ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో లారెన్స్ వరుసగా హర్రర్ మూవీస్ తీసి ఆడియన్స్ కి థ్రిల్ కలిగించారు.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ సాధించారు. అయితే.. ఇప్పుడు కాంచన మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఆమధ్య కాంచన 4 తీస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇప్పుడు కాంచన రీ రిలీజ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి.. కాంచన రీ రిలీజ్ లో రికార్డ్ (Record) సెట్ చేస్తుందా..? కాంచన 4 వచ్చేది ఎప్పుడు..?

Kanchana re release | పోకిరితో ట్రెండ్ స్టార్ట్..
పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం.. అదే రీ రిలీజ్. ఇది ఓ ట్రెండ్ గా మారింది. పోకిరి సినిమా నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దీంతో చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ( Pawankalyan), రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోల పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం స్టార్ట్ అయ్యింది. అయితే.. జనాలు చూస్తున్నారు కదా అని హిట్ సినిమాలే కాకుండా ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తుండడంతో జనాలు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో రీ రిలీజ్ ట్రెండ్ ముగింసింది అనుకుంటే.. మళ్లీ అప్పుడప్పుడు రీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.

Kanchana re release | ట్రెండింగ్ లో కాంచన..
ఇదిలా ఉంటే.. లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమాని మార్చి 13న రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే.. స్టార్ హీరోల రీ రిలీజ్ లకే అంతగా ఆదరణ లభించడం లేదు. ఈ సినిమాకి (Movie) అంతగా రెస్పాన్స్ రాదేమో అనుకుంటే.. రీ రిలీజ్ కి వారం రోజులు ముందుగానే బుక్ మై షో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇరవై నాలుగు గంటల్లో ఏడు వేలకు పైగా టికెట్లు అమ్మిందంటే ఆశ్చర్యం కలిగించే విషయం. ఉదయం త్వరగా వేసే కొన్ని షోలు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీన్ని బట్టి కాంచనకు ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి లారెన్స్ డ్యాన్స్, కామెడీ, శరత్ కుమార్ హిజ్రాగా అద్భుతమైన నటన కారణం అని చెప్పచ్చు. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. రీ రిలీజ్ లో కూడా రికార్డ్ సెట్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Kanchana re release | అంతకు మించి కాంచన 4..
కాంచన 4 అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటి వరకు లారెన్స్ (Lorence) నుంచి వచ్చిన హర్రర్ సినిమాలకు పూర్తి భిన్నంగా అంతకు మించి నవ్వించేలా, అంతకు మించి భయపెట్టేలా స్టోరీని రాసుకున్నాడట. లేట్ అయినా ఫరవాలేదు.. లేటెస్ట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడట. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారని సమాచారం.
