Kamareddy | ఇంట్లో చోరీ…

Kamareddy | ఇంట్లో చోరీ…

బంగారం, వెండి, నగదు అపహరణ


Kamareddy | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం (Edapalli mandal) అంబం (వై) గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. స్థానికుడు ఔసలి వెంకటేశం ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో ఓ శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

ఎడపల్లి ఎస్సై రమ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు (thieves) ఇంటి తాళం ధ్వంసం చేసి, బీరువాలో దాచిన 4 గ్రాముల బంగారం, 20 తులాల వెండి వస్తువులు, రూ.20వేల నగదు, 10 తులాల పట్టి గొలుసులు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply