Kamareddy | చల్మెడలో పులి సంచారం..

Kamareddy | చల్మెడలో పులి సంచారం..

  • పెద్దపులి ఆనవాళ్లను సేకరిస్తున్న అధికారులు…

Kamareddy | నిజాంపేట, ఆంధ్రప్రభ : గత వారం రోజులుగా కామారెడ్డి జిల్లాలోని పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆ పెద్దపులిని శుక్రవారం ఉదయం చల్మెడ గ్రామ శివారులో గల మల్లన్న గుట్ట వద్ద రైతు పొలంలో బర్రె వద్ద పాలు పిండుకుని వస్తున్న సమయంలో వెనుక నుండి పరిగెత్తుకుని వస్తున్న‌ పులిని గమనించి కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగిందన్నారు.

Kamareddy

అతను వెంటనే పోలీస్ అండ్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పెద్దపల్లి అనవాళ్లను సేకరిస్తున్నారు. గ్రామస్తులు మల్లన్న గుట్ట ప్రాంతంలో తిరగవద్దని.. ఎవ‌రికైనా పెద్దపులి కనిపించినట్లయితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలన్నారు.

Leave a Reply