Kalki – Varanasi | జక్కన్న ప్లాన్ ఏంటి..?

Kalki – Varanasi | జక్కన్న ప్లాన్ ఏంటి..?
Kalki – Varanasi | వారణాసి పై పెరుగుతున్న అంచనాలు
జక్కన్న గ్లోబల్ ప్లానింగ్
మహేష్ బాబు పాత్రపై చర్చ
కల్కితో పోలికలపై ఆసక్తి
Kalki – Varanasi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో ఎక్స్ పెక్టేషన్స్ బాగా పెరిగాయి. ఇంకా చెప్పాలంటే.. అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మూవీకి కల్కితో పోలికలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీంతో అసలు జక్కన్న ఏం చెప్పనున్నాడు..? వారణాసి ఎలా ఉండబోతుంది..? ప్రచారంలో ఉన్నది నిజమేనా..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. వారణాసి ఎలా ఉండబోతుంది..?
Kalki – Varanasi | జక్కన్న ప్లానింగే వేరు..

దర్శకధీరుడు రాజమౌళి ప్లానింగ్ మామూలుగా ఉండదు కదా.. సినిమా రిలీజ్ కి సంవత్సరం ఉండగానే ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఈ మూవీ టీమ్ హాలీవుడ్ మీడియాకి ఇంటర్ వ్యూలు ఇచ్చారు. అమెరికన్ మీడియాల్లో వచ్చే కథనాలు హాలీవుడ్ ప్రేక్షకులకు సినిమా పై మరింతగా క్యూరియాసిటీని పెంచుతాయి. అందుకనే అక్కడ మీడియాను ఇక్కడికి ఆహ్వానించారు. వారణాసి సెట్స్ కూడా ఎలా ఉన్నాయో చూపించారట. దీనికి సంబంధించిన విజువల్స్ బయటకు రావడంతో గ్లోబల్ రేంజ్ లో వారణాసి మూవీ పై బజ్ క్రియేట్ అయ్యింది.
Kalki – Varanasi | కల్కి ప్రభాస్ పాత్రలా మహేష్ బాబు రోల్..?

ఇదిలా ఉంటే.. ఇంటర్ వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పారు. ఇక అక్కడ నుంచి కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను పోలి ఉంటుందని.. వార్తలు వస్తున్నాయి. అయితే.. కల్కి కాశీ నేపధ్యంతో రూపొందింది. ఈ మూవీలో కూడా కాశీ గురించి ఉండడంతో ప్రచారంలో ఉన్నది నిజమే అనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో జక్కన్న ఎలా చూపించనున్నాడు.

ఈ సినిమాలో ఏం చెప్పనున్నాడు అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో మహేష్ బాబు రాముడు పాత్రలో కూడా కనిపించనుండడం విశేషం. దీంతో ఈ సినిమా పై రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మరి.. జక్కన్న ఈసారి ఏ రేంజ్ లో చరిత్ర సృష్టిస్తారో చూడాలి.
