Kadem | కేసీఆర్ పై సీట్ వేధింపులకు నిరసన

Kadem | కేసీఆర్ పై సీట్ వేధింపులకు నిరసన

  • కడెం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నేతల ఆందోళన

Kadem | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, సిట్ విచారణ పేరుతో ఉద్దేశ్యపూర్వకంగా వేధించడాన్ని ఖండిస్తూ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ కడం మండల అధ్యక్షుడు నల్ల జీవన్ రెడ్డి, నిర్మల్ జిల్లా తాజా మాజీ జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ ఎండి రఫిక్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడం మాజీ ఎంపీపీ ఎం. రాజేశ్వర్ గౌడ్, కడం మాజీ ఎంపీపీ బుక్య అమ్మి బాపూ రావు ఆధ్వర్యంలో ఈ రోజు కడం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరసన కార్యక్రమం చేపట్టారు.

నిర్మల్ – మంచిర్యాల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు,ఉప సర్పంచ్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ వివిధ అనుబంధాల సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, వార్డ్ మెంబర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Leave a Reply