Kadem | అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
కడెంలో ఘనంగా వర్ధంతి వేడుకలు
Kadem | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనుల రాజ్యాధికారం కోసం ఆయన ఎంతో శ్రమించారని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులు డి కొండ విజయ్ కుమార్, కే .లక్ష్మణ్ పి శ్రీలేఖ, మనోజ్ కుమార్, మాజీ సర్పంచులు కే .అనూష, కాంగ్రెస్ పార్టీ చిట్యాల చిన్నయ్య మహిళా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ భవానీ, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

