నార్సింగిలో ఘనంగా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి

నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శనివారం జ్యోతిరావు ఫూలే 200వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కండ్లకొయ్య యాదగిరి ఆధ్వర్యంలో ఎస్బీఐ సమీపంలో ఫూలే చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మండల అధ్యక్షుడు కండ్లకొయ్య యాదగిరి, ఆకుల మల్లేశం గౌడ్, కుమ్మరి బాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యా విస్తరణకు ఫూలే చేసిన సేవలను కొనియాడారు. అలాగే ఎస్బీఐ సమీపంలోనే జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోతిలాల్, పున్నా రమేష్, గుర్రాల సుధాకర్, ఎం.కే. రాజు, మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు, దళితరత్న అవార్డు గ్రహీత బొమ్మల మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
