కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకే!

కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకే!
నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకే బాకీ కార్డుల(Outstanding cards)ను పంపిణీ చేస్తున్నామని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంఠరెడ్డి తిరుపతిరెడ్డి(Kanthareddy Tirupati Reddy) అన్నారు. ఈ రో్జు నిజాంపేట మండల కేంద్రంలోని వంజర సంఘంలో మండల స్థాయి బీఆర్ఎస్(BRS) నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్య రెడ్డి , మాజీ సర్పంచులు గోపరి నరసింహులు అరుణ్ కుమార్, అనుష లక్ష్మి నరసింహులు(Anusha Lakshmi Narasimhulu, మాజీ ఎంపీసీలు చింతల స్వామి బాల్రెడ్డి, కల్వకుంట, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్లు అందె కొండల్ రెడ్డి, బాపురెడ్డి, ఆయా గ్రామాల అధ్యక్షులు దుర్గయ్య నరేందర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు(Mavuram Raju), నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెలమేటి నాగరాజు, నాయకులు లచ్చపేట రాములు, మల్లేశం, సోమ్లా నాయక్, సుభాష్ నాయక్, ఎల్లం, యాదవ్ మండల నాయకులు, బీఆర్ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
