Junior Cricket | త్ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ కు మయాంకరాజ్ పురోహిత్

Junior Cricket | ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ కు మయాంకరాజ్ పురోహిత్

Junior Cricket | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారవేత్త తాన్ సింగ్ రాజ్ పురోహిత్ గులాబ్ కవర్ రాజ్ పురోహిత్ కుమారుడు మయాంక్ రాజ్ పురోహిత్ ఇంటర్ స్టేట్ సబ్ జూనియర్ క్రికెట్ టోర్నీకి ఎంపికయ్యారు. హైదరాబాద్ తెలంగాణ స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కే.అంజి, శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈనెల 7న హైదరాబాద్ బాచుపల్లి శంకరి క్రికెట్ అకాడమీలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ క్రికెట్ ఎంపికలో మయాంక్ రాజ్ పురోహిత్ పాల్గొని, అసమాన క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైనట్లు విశ్రాంత పీఈటి బి.గోపాలం తెలిపారు.

ప్రస్తుతం మయాంక్ రాజ్ పురోహిత్ హైదరాబాద్ లో వెరిటాస్ సెంట్రల్ గవర్నమెంట్ సైనిక పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన మయాంక్ రాజ్ పురోహిత్ ఈనెల 27 నుండి 29 వరకు విశాఖపట్నం మెడ్ఓస్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగనున్న టోర్నమెంట్ లో తెలంగాణ క్రికెట్ జట్టు తరుపున ఆడనున్నారని తండ్రి తాన్ సింగ్ రాజ్ పురోహిత్ తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ,చెన్నై, పుదుచ్చేరి ఆరు జట్లు పాల్గొంటున్నాయిని ఆయన తెలిపారు. ఇంటర్ స్టేట్ క్రికెట్ హైదరాబాద్ జట్టుకు ఎంపికైన మయాంక్ రాజ్ పురోహితును హైదరాబాద్ వెరిటాస్ సైనిక పాఠశాల చైర్మన్ బి. శేషారెడ్డి, డీన. వి. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ బి.సందీప్ రెడ్డి, విశ్రాంత పీఈటి బి.గోపాలం అభినందించారు.

తాన్ సింగ్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ… త‌మ కుమారుడు ఇంటర్ స్టేట్ క్రికెట్ టవర్నమెంట్ కు ఎంపిక కావడానికి బి.గోపాలం కృషి, సాకారం అందించారని, గతంలో త‌మ కుమారుడు తిలక్ సింగ్ రాజ్ పురోహిత్, కూతురు రీతు రాజ్ పురోహిత్, త‌మ అల్లుడు ఇందర్ సింగ్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ క్రీడల్లో పాల్గొనుటకు సహకారం అందించారన్నారు. ఇందర్ సింగ్ ప్రస్తుతం రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడని, విశ్రాంత పిఈటి బి.గోపాలంనకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణానికి చెందిన మయాంక్ రాజ్ పురోహిత్ ఇంటర్ స్టేట్ సబ్ జూనియర్ క్రికెట్ టోనీలకు ఎంపిక కావడం పట్ల పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply