June4th | టాక్సిక్‌కు పోటీగా ‘జన నాయగన్’..?

June4th | టాక్సిక్‌కు పోటీగా ‘జన నాయగన్’..?
June4th | యశ్ ‘టాక్సిక్’ మూవీ పోస్ట్ పోన్
మార్చి 19 నుంచి జూన్ 4కు వాయిదా
సోలో రిలీజ్ కోసం మేకర్స్ ప్లాన్..?
సెన్సార్ సమస్యలు తీరిన విజయ్ సినిమా
తక్కువ గ్యాప్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్
బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ
June4th | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేజీఎఫ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన టాక్సిక్ మూవీని మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలి అనుకున్నారు. అంతా రెడీ అయ్యింది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే.. ఊహించని విధంగా టాక్సిక్ పోస్ట్ పోన్ అయ్యింది. జూన్ 4న టాక్సిక్ మూవీ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాక్సిక్.. జన నాయగన్ పోటీపడనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. జన నాయగన్ వచ్చేది ఎప్పుడు..?
June4th | సోలో రిలీజ్ కష్టమేనా..

టాక్సిక్ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న వార్ నేపథ్యంలో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అది వారం రోజులు వాయిదానో రెండు వారాలు వాయిదానో కాదు.. మార్చి 19న రావాల్సిన సినిమాని జూన్ 4కు పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు ఇక పోటీ ఏమీ ఉండదు.. సోలో రిలీజ్ దొరుకుతుంది అనేది మేకర్స్ ప్లాన్ అని టాక్ వినిపించింది. అదే మార్చి 19న రిలీజ్ చేస్తే.. ధురందర్ 2 తో పోటీపడాలి. అది కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది.
June4th | తక్కువ గ్యాప్ లోనే టాక్సిక్, జన నాయగన్..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాక్సిక్ సినిమాకి వేరే నిర్మాణ సంస్థ నుంచి కాకుండా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ నుంచే పోటీ రాబోతుందని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. మేటర్ ఏంటంటే.. టాక్సిక్ సినిమాని నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థే కోలీవుడ్ స్టార్ విజయ్ జన నాయగన్ మూవీని నిర్మించింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఇప్పుడు సెన్సార్ కష్టాలు తీరాయని.. జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కాబట్టి.. జూన్ లో ప్రథమార్ధంలో జన నాయగన్ రిలీజ్ ఉండచ్చు. టాక్సిక్, జన నాయగన్ తక్కువ గ్యాప్ తోనే విడుదల అవుతాయని ప్రచారం జరుగుతుండడం ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

