Jumped Scam : సైబర్ వల Andhra Prabha SPL Story

Jumped Scam : సైబర్ వల Andhra Prabha SPL Story
జరా భద్రం గురూ..
చిక్కితే.. అకౌంట్ ఖాళీ
ఇది కొత్త జంప్డ్ డిపాజిట్ స్కామ్
ఇలా ₹ 100 వేసి..అలా.. మొత్తం గుటుక్కు
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
ఈ డిజిటల్ యుగంలో, నగదు లావాదేవీలను UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చాలా సులభతరం చేసింది. అయితే, ఈ సౌలభ్యంతో పాటు, మరి కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. UPI పేరిట ఎకౌంట్ పేరిట తరచుగా చీటింగ్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు, UPI చెల్లింపునూ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

చేతిలో రూపాయి పెట్టి అకౌంట్ లో మొత్తం సొమ్మును ఎలా నొక్కేయాలో.. ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇచ్చినమ్మ వాయనం.. తీసుకున్నమ్మ వాయనం అనే రీతిలో.. సృష్టించిన ఈ స్కామ్ తో.. సాధారణ UPI వినియోగదారులే పాటు సైబర్ క్రైమ్ ఏజెన్సీలు కూడా ఉలిక్కిపడుతున్నాయి.
ఈ స్కామ్‌లో , సైబర్ దొంగలు ముందుగా వినియోగదారుడి ఖాతాలో చిన్న మొత్తాన్ని జమ చేసి, ఆపై వారిని తెలివిగా మోసగించి పెద్ద మొత్తాన్ని తిరిగి లాగేస్తారు. దీనికి ‘జంప్డ్ డిపాజిట్ స్కామ్’ అని పేరు పెట్టారు. కొన్ని రోజుల కిందట తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ ఈ కొత్త స్కామ్‌ను గుర్తించింది.
తెలియని కాల్స్ లేదా లింక్‌లు మాత్రమే కాకుండా, ఖాతాలోకి అకస్మాత్తుగా క్రెడిట్ సొమ్ము కూడా ప్రమాదానికి సంకేతం అని తమిళనాడు సైబర్ క్రైమ్ సోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ ‘జంప్డ్ డిపాజిట్ స్కామ్’ ఎలా జరుగుతుంది? మనం ఎలా గుర్తించవచ్చు. ఎలా తప్పించుకోవచ్చు..?
Jumped Scam : జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏమిటి?
ఇది కొత్త UPI ఆధారిత సైబర్ మోసం. ఇందులో, మోసగాళ్ళు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో తొలుత చిన్న మొత్తాన్ని బదిలీ చేస్తారు. అకస్మాత్తుగా నగదు జమా కాగానే బ్యాలెన్స్‌ను తనిఖీ చేసి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు కోవటానికి ఖాతాదారుడు UPI యాప్ ను (Phone pay, Google Pay, Paytm) తెరుస్తారు.
ఈ ఇదే సమయంలో, మోసగాళ్ళు నకిలీ ‘UPI మనీ రిక్వెస్ట్’ను పంపుతారు. బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి వినియోగదారుడు త్వరగా UPI పిన్‌ను నమోదు చేస్తాడు. కానీ తెలియకుండానే, నకిలీ రిక్వెస్టును ఆమోదిస్తారు. పిన్ నమోదు చేసిన వెంటనే, ఖాతా నుంచి మోసగాడి ఖాతాకు పెద్ద మొత్తం బదిలీ అవుతుంది. అంతే.. ఇక ఖాతాదారుడు లబోదిబో అని గగ్గోలు పెట్టక తప్పదు.
Jumped Scam : ఈ స్కామ్‌ను ఎలా అమలు చేస్తారు?
అకస్మాత్తుగా UPI యాప్ ఖాతాలో ₹ 50లు జమ జరిగినట్టు మెజేసీ వస్తుంది. మీరు వెంటనే మీ బ్యాంక్ యాప్‌ను తెరిచి, బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి మీ పిన్‌ను నమోదు చేస్తారు. ఈ సమయంలో, కొత్తగా క్రెడిట్ జరిగిన సొమ్ముని రిటన్ చేయాలని నకిలీ అభ్యర్థనను పంపుతాడు. మీరు ఇప్పటికే యాప్ లో క్రెడిట్ సొమ్ము తనిఖీలో బిజీగా ఉన్నందున, మీరు పట్టించుకోరు, ఈ అభ్యర్థనను గుర్తించి మీరు మీ పిన్‌ను మళ్ళీ నమోదు చేస్తారు. అంతే మోసగాడి ఖాతాలోకి నగదు చేరుతుంది, అంతలోనే ఖాతాలో మొత్తం సొమ్ము మాయమవుతుంది .
Jumped Scam : ఈ మాయలో ఎందుకు చిక్కుతారు ?
తమ ఖాతాలోకి అకస్మాత్తుగా డబ్బు వచ్చినప్పుడు, ఉత్సాహంగా ఖాతాదారుడు ఉరకలేస్తాడు. బ్యాలెన్స్ తనిఖీ చేస్తారు. UPI ప్రక్రియ వేగంగా సులభంగా ఉంటుంది కాబట్టి, డబ్బు అభ్యర్థనలను పట్టించుకోరు. సైబర్ నేరగాళ్లకు ఇదూ బడా చాన్స్. బ్యాలెన్స్ తనిఖీకి, నగదు బదిలీకి పిన్ నమోదు ప్రక్రియలు రెండింటికీ వేర్వేరు చర్యలు అని ఖాతాదారులు అర్థం చేసుకోలేరు. ఈ గందరగోళంలో తొందర పాటుతో ఈ స్కామ్‌కు బలి అవుతారు.
Jumped Scam : భద్రం ఇలా..
ఈ స్కామ్‌ను నివారించడానికి, UPI వినియోగదారులు కొంచెం సాధారణ జ్ఞానం ఓపికను పాటించాలి. ఖాతాలో అకస్మాత్తుగా మొత్తం చూసిన తర్వాత ఏదైనా తొందరపాటు చర్య తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. దీని కోసం, కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. UPIని సురక్షితంగా ఉపయోగించడానికి అప్రమత్తత సరైన సమాచారం చాలా ముఖ్యమైనవి. ఏదైనా డిజిటల్ లావాదేవీలో తొందరపడటం, తెలియని కాల్‌లు / సందేశాలను విశ్వసించడం ధృవీకరణ లేకుండా చెల్లింపులు చేయడం వల్ల నష్టాలు సంభవించవచ్చు.
Jumped Scam : కాల్ లేదా మెసేజీ వస్తే ఏం చేయాలి?
అటువంటి పరిస్థితిలో, భయపడవద్దు. వెంటనే స్పందించవద్దు. మీ బ్యాంక్ లేదా UPI యాప్ కస్టమర్ కేర్‌ను నేరుగా సంప్రదించడం ఉత్తమ మార్గం. అదనంగా, మీరు కాల్ చేసిన వ్యక్తిని నగదు తీసుకోవడానికి మీ సమీప పోలీస్ స్టేషన్‌కు రావాలని అడగవచ్చు. అవసరమైతే, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి.
అటువంటి పరిస్థితిలో భయపడవద్దు, తక్షణ చర్య తీసుకోండి. ఆలస్యం చేయకుండా, మీ బ్యాంక్ లేదా UPI యాప్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మోసం గురించి తెలపండి. అన్ని లావాదేవీలను వెంటనే బ్లాక్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కి కాల్ చేయండి లేదా https://cybercrime.gov.in/ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. కేసును ఎంత త్వరగా దాఖలు చేస్తే , అంత త్వరగా మీ డబ్బు తిరిగి పొందవ,చు. లేదో.. ఇక అంతే.
click here to read Bapatla | మద్యం మత్తులో.. మామను చంపిన అల్లుడు…
అటువంటి పరిస్థితిలో భయపడవద్దు, తక్షణ చర్య తీసుకోండి. ఆలస్యం చేయకుండా, మీ బ్యాంక్ లేదా UPI యాప్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మోసం గురించి తెలపండి. అన్ని లావాదేవీలను వెంటనే బ్లాక్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కి కాల్ చేయండి లేదా https://cybercrime.gov.in/ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. కేసును ఎంత త్వరగా దాఖలు చేస్తే , అంత త్వరగా మీ డబ్బు తిరిగి పొందవ,చు. లేదో.. ఇక అంతే.అటువంటి పరిస్థితిలో భయపడవద్దు,
తక్షణ చర్య తీసుకోండి. ఆలస్యం చేయకుండా, మీ బ్యాంక్ లేదా UPI యాప్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మోసం గురించి తెలపండి. అన్ని లావాదేవీలను వెంటనే బ్లాక్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కి కాల్ చేయండి లేదా https://cybercrime.gov.in/ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. కేసును ఎంత త్వరగా దాఖలు చేస్తే , అంత త్వరగా మీ డబ్బు తిరిగి పొందవ,చు. లేదో.. ఇక అంతే.
