ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు

ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు

  • కాంగ్రెస్ పార్టీని నమ్మినందుకు ధన్యవాదాలు
  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
  • బిచ్కుంద మున్సిపల్ లో
  • ఎగరనున్న కాంగ్రెస్ జెండా

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది.మొత్తం 12 వార్డులలో 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, రెండు వార్డులు బిఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ బిచ్కుంద ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పై విశ్వాసాన్ని నిలబెట్టారని,బిచ్కుంద మున్సిపాలిటీలోని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ కి పట్టం కట్టడం జరిగిందని,ఓటరు మహాశయులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే తోట అన్నారు.ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు పన్నిన,ఎన్ని అవస్తాలు ప్రచారం చేసినప్పటికీ బిచ్కుంద ప్రజలు నమ్మకుండా తమపై కాంగ్రెస్ పార్టీకి పై నమ్మకంఉంచి గెలిపించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply